NLG: ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వం దీర్ఘకాలికంగా చెల్లించాల్సిన ఫీజు రీయంబర్స్మెంట్, ఉపకార వేతనాల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ ఈ నెల 3 నుంచి నిరవధిక బంద్ చేపట్టాలని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు నిర్ణయించాయి. తమ సమస్యలు పరిష్కరించే వరకు తరగతులు నిర్వహించబోమని తేల్చి చెప్పాయి. అప్పుల ఊబిలో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవలన్నారు.