KMM: వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మిరప పంటకు వేరు కుళ్ళు వ్యాధిపై రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పాలేరు ఉద్యానవన శాఖ అధికారి అపర్ణ ఇవాళ తెలిపారు. పంటకు ఎక్కువ నీటి తడులు ఇవ్వకుండా నియంత్రించాలన్నారు. వ్యాధి నివారణకు ట్రైకోడర్మా విరిడే, సూడోమోనస్ కలిపిన ద్రావణాన్ని పాదుల్లో తడపాలని రసాయనాలు పిచాకారి చేయాలని సూచించారు.