NZB: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శుక్రవారం నీలకంఠేశ్వరాలయాన్ని దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నీలకంఠేశ్వర స్వామి దేవస్థానంలో సుదర్శన్ రెడ్డితో ప్రత్యేకంగా అభిషేకం, అర్చన చేయించారు.