NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తిలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు మంగళవారం ఎన్నికలు పోలింగ్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్టేజ్2 రిటర్నింగ్ అధికారి రవిబాబు, పంచాయతీ కార్యదర్శి కంచర్ల గౌతంరెడ్డితో కలిసి పోలింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు పాటించవలసిన నియమాల గురించి వివరించారు.