MDK: పదవ తరగతి పరీక్ష ఫీజు గడువును ఈనెల 20వ తేదీ వరకు పెంచినట్లు మెదక్ జిల్లా విద్యాధికారి రాధా కిషన్ శుక్రవారం తెలిపారు. విద్యార్థులు నేరుగా అన్ని సబ్జెక్టులకు 125 పరీక్ష ఫీజు పాఠశాలలో చెల్లించాలని చెప్పారు. ప్రధానోపాధ్యాయులు ఈనెల 21 లోపు విద్యార్థుల ఫీజు వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయాలని పేర్కొన్నారు.