SRD: రామచంద్రపురం డివిజన్ పరిధిలోని శ్రీ సాయి నగర్ కాలనీలో కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పా నగేష్ శనివారం ఉదయం పర్యటించారు. కాలనీలో జరుగుతున్న విద్యుత్ పనులను ఆమె ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా త్వరలో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్, బాత్రూమ్ స్థలాలను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.