మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని MCC దగ్గర ద్విచక్ర వాహనాన్ని ట్రాలీ ఢీ కొట్టింది. దీంతో బైక్పై నుంచి మహిళ రోడ్డుపై పడిపోవడంతో గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో స్థానికులు క్షతగాత్రురాలిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు వారు పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.