NLG: సహజ వ్యవసాయం ద్వారా కల్తీలేని, ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుందని సహజ వ్యవసాయాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టర్ మునుగోడు మండలలోని కిష్టాపురం గ్రామంలో రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా యువ రైతు జక్కుల వెంకటేశ్ పండిస్తున్న సహజ పంటలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు.