NGKL: వెల్దండ మండల ఇన్ఛార్జ్ ఏఈ వెంకటేష్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఇవాళ పట్టుబడ్డాడు. చొక్కన్నపల్లి గ్రామానికి చెందిన రైతు వద్ద రూ.20 వేలు డిమాండ్ చేసి, రూ.15 వేలు తీసుకుంటుండగా అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. కల్వకుర్తి ప్రాంతంలో వరుస ఏసీబీ దాడులు జరుగుతున్నా.. అధికారుల తీరులో మార్పు రావడం లేదని ఈ ఘటనతో మరోసారి స్పష్టమౌతుంది.