BHPL: జిల్లా కేంద్రంలోని ఓ చెరువు శిఖంలో మందిర నిర్మాణానికి అనుమతి ఇచ్చిన కలెక్టర్ పై హైకోర్టు ఇవాళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్మాణం ఎందుకు అనుమతిచ్చారని జస్టిస్ అనిల్ కుమార్ ప్రశ్నించారు. కలెక్టర్‌ను నిందితుడిగా చేర్చలేదని పోలీసులను నిలదీశారు. అధికారుల నిర్లక్ష్యంతో ఛార్జిషీట్ ఆలస్యమవుతోందని విమర్శించింది. కేసు ఈనెల 18కి వాయిదా పడింది.