ADB: గ్రామాల్లో సమిష్టి నిర్ణయాలతోనే అభివృద్ధి సాధ్యమని ఆదిలాబాద్ MP గోడం నగేశ్ పేర్కొన్నారు. శనివారం భీంపూర్ మండలంలోని గోల్లాఘాట్ గ్రామస్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. సర్పంచ్ రామ్ ప్రభు, ఉపసర్పంచ్ టెకం గణేష్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాటిపల్లి గంగాధర్ రావు తదితరులు ఉన్నారు.