MBNR: జిల్లా కేంద్రానికి చెందిన అయ్యప్ప గురు స్వామి రఘుపతి శర్మను మంగళవారం అఖిలభారత అయ్యప్ప ప్రచార సమితి వరు సమర్థ సద్గురు బిరుదుతో ఘనంగా సత్కరించారు. జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్ కాలనీ అయ్యప్ప దేవాలయంలో ఆయనకు తలపాగతరింపజేసి బిరుదుతో కూడిన చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రచార సమితి అధ్యక్షులు, వందలాదిగా అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.