నల్లగొండ మండలం డిండి వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను, శనివారం సాయంత్రం నల్లగొండ శివారులోని ప్రతాప్ నగర్లో పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్కు తరలించి ముగ్గురు డ్రైవర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై బాలకృష్ణ తెలిపారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.