JGL: ధర్మపురి పట్టణంలో వీధికుక్కలు, కోతులు, ఆవుల సంచారం వల్ల ప్రజలు, భక్తులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో BJP పట్టణాధ్యక్షుడు గాజు భాస్కర్ నేతృత్వంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందించారు. కుక్కల దాడులు, కోతుల పెరుగుదల, ఆవుల సమస్యపై తక్షణ చర్యలు తీసుకుని కుక్కలను షెల్టర్లకు, కోతులను అడవికి తరలించాలని తెలిపారు.