WGL: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన యువజన, క్రీడా వారోత్సవాల్లో వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన యువతీ యువకులకు కలెక్టర్ సత్యశారద మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు. శనివారం కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో చీఫ్ మినిస్టర్స్ కప్ 5వ ఎడిషన్లో రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులను కూడా ఆమె అభినందించారు.