యాదాద్రి: రామన్నపేట రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) రాజేశ్వర్‌ను సస్పెండ్ చేసినట్లు చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి తెలిపారు. కక్కిరేణిలోని శ్రీ భక్తమార్కండేయ స్వామి ఆలయానికి చెందిన 4.3 ఎ. భూమి ధరణిలో తప్పుగా నమోదైంది. దీనిపై 2024లో ఆర్ఐ పంచనామా చేసి ఆలయానికి చెందినదని నిర్ధారించారు. అయితే, 2025 జనవరిలో తప్పుడు పంచనామా ఇచ్చినందుకు సస్పెండ్ చేశారు.