GDWL: కేటీదొడ్డి మండలం నందిన్నె గ్రామ పరిధిలోని ఓ బావిలో మంగళవారం అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహంపై అనుమానాస్పద గాయాలు ఉన్నాయని గ్రామస్థులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.