HNK: శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం BRS నూతన గ్రామ కమిటీ ఇవాళ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వారిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 11న జరగనుతున్న సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి గ్రామంలోనూ బీఆర్ఎస్ జెండా ఎగరేయాలని నూతన కమిటీ సభ్యులకు పిలుపునిచ్చారు.