RR: షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం రంగంపల్లి గ్రామస్తులు డిపో మేనేజర్‌ను కలిశారు. రంగంపల్లి గ్రామం పరిగి రహదారి నుంచి సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యార్థులు బస్సు సౌకర్యం లేకపోవడంతో కాలి నడకన ప్రయాణిస్తున్నారని తెలిపారు. తక్షణమే స్పందించి బస్సు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం అందజేశారు.