MBNR: చిన్న చింతకుంట మండలంలోని బండ్రవల్లి గ్రామంలో ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఇవాళ నూతన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలన్నారు. ఆరుగాలాలు పండించిన పంటను దళారులకు అమ్మి మోసపోవద్దన్నారు.