WGL: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే మండలాలలో ఓటర్ స్లిప్పుల పంపిణీ జోరుగా కొనసాగుతుంది. ప్రతి గ్రామంలో బూత్ లెవెల్ అధికారులు (BLO) ఇంటింటికి తిరిగి స్లిప్లును పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ పర్వతగిరి మండలంలో BLO కరుణాకర్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయన కుటుంబ సభ్యులకు స్లిప్పులు అందజేశారు.