WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని BRTU కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో BRTU జిల్లా అధ్యక్షుడు యువరాజ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను కార్మిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి లేబర్ కోడ్ విధానాన్ని రద్దు చేసి కార్మిక వర్గానికి బాసటగా నిలవాలని కోరారు.