MDK: రేపు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న బీసీల ధర్మపోరాట దీక్ష విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షులు మెట్టు గంగారాం పిలుపునిచ్చారు. బుధవారం బీసీ సంక్షేమ సంఘం నాయకులు రామాయంపేటలో మీడియా సమావేశం నిర్వహించారు. 42 శాతం రిజర్వేషన్ సాధన కోసం చేపట్టిన ధర్మ పోరాట దీక్షలో పెద్ద ఎత్తున బీసీ నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.