BHNG: బీఆర్ఎస్ పార్టీకి జడ్పీ మాజీ వైస్ ఛైర్మన్ ధనవాత్ బీకు నాయక్ రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం భువనగిరి పట్టణంలోని వివేరా హోటల్లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు తనను ఘోరంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.