వనపర్తి జిల్లా పరిధిలోని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పట్టణాల్లో నివసిస్తున్న అభ్యర్థుల స్నేహితులు, బంధువులు కూడా ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు. హైదరాబాద్ వంటి దూర ప్రాంతాల్లో ఉన్నవారు సైతం సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనితో గ్రామాల్లో జనసంచారం పెరిగి, సందడిగా మారాయి.