ASF: చింతలమానెపల్లి పోలీస్ స్టేషన్‌ను ఇవాళ జిల్లా ఎస్పీ నీతికా పంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఎస్సై నరేష్‌కు సూచించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు,పెండింగ్ కేసుల పురోగతి,స్టేషన్ హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట డీఎస్పీ వాహిదుద్దీన్, సీఐ సంతోష్ కుమార్ ఉన్నారు.