MBNR: కార్పొరేషన్ ఎన్నికలలో 38వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని డివిజన్‌కు చెందిన యువ బీఆర్ఎస్ నాయకులు కోట్ల శివకుమార్ యాదవ్ శనివారం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు శివరాజ్‌కు ఆయన దరఖాస్తును సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ముడా ఛైర్మన్ గంజి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.