ADB: జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి ఏర్పడింది. రోజు తెల్లవారుజామున నుంచి రాత్రి వరకు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు, ప్రజల మధ్య పరస్పర భేటీ జరుగుతోంది. అప్పులకు పాలవ్వకుండా సర్పంచ్ పదవికి దూరంగా ఉండాలని పలువురు చెపుతున్నప్పటికీ.. ఎంత అప్పులైనా సరే, తమకు గెలుపే ముఖ్యం అంటూ ఓ వైపు అభ్యర్థులు అంటున్నారు.