WNP: యువకులకు వివేకానంద స్వామి జీవితం ఆదర్శం అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజిని అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా నర్సింగాయపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేషనల్ యూత్ డే కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు, అక్రమ రవాణా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఉద్యోగాల కోసం మోసాలలో పడవద్దు అన్నారు.