NGKL: వంగూరు మండలంలో వాట్సప్ గ్రూపులు నిర్వహిస్తున్న అడ్మిన్లు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై మహేష్ ఆదివారం సూచించారు. తమ గ్రూపుల్లో విద్వేషాలు,అసత్యాలు,హింసకు సంబంధించిన సందేశాలు ప్రచారం కాకుండా చూసుకోవాలని కోరారు. చట్టవిరుద్ధమైన పోస్టులు పెట్టిన వారిని గ్రూప్ నుంచి వెంటనే తొలగించాలని, లేదంటే చట్ట ప్రకారం అడ్మిన్లపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.