SRCL: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను ఇంఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదివారం పరిశీలించారు. వేములవాడ రూరల్ మండలంలోని ఫాజుల్ నగర్ వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్‌పోస్ట్‌ను ఇంఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి తనిఖీ చేశారు. రిజిస్టర్లు పరిశీలించి, వాహనాల తనిఖీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.