BDK: జూలూరుపాడు మండలం సూరారం గ్రామంలో ఆదివారం ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. బానోత్ నాగరాజు అనే వ్యక్తి తన వ్యవసాయ క్షేత్రంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. నాగరాజు మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.