KNR: ఇల్లందకుంట మండల రైతులకు ఈ నెల 25 నుంచి జీలుగ విత్తనాల పంపిణీ ప్రారంభమవుతుందని ఏవో సూర్యనారాయణ తెలిపారు. డీసీఎంఎస్ కేంద్రాలు లక్ష్మన్నపల్లి, ఇల్లందకుంట, సిరిసేడు, రాచపల్లిలో తలా 200 బ్యాగులు, పీఏసీఎస్ మల్యాలలో 133 బ్యాగులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. 30 కిలోల సంచి ధర రూ.2452గా నిర్ణయించగా, ఇది రెండున్నర ఎకరాలకు సరిపోతుందన్నారు.