కరీంనగర్ నగర మహిళా పోలీస్ స్టేషన్కు కొత్త సీఐగా రఫీకాఖాన్ నియమితులయ్యారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జోన్ ఐజీ కార్యాలయం నుంచి బుధవారం నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి. గతంలో ఇక్కడ పనిచేసిన శ్రీలత బదిలీ అయినప్పటి నుంచి, అంటే సుమారు రెండు నెలలుగా ఈ స్థానం ఖాళీగా ఉంది. ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో వీఆర్లో ఉన్న రఫీక్ ఖాన్ కరీంనగర్ వచ్చారు