BHNG: యాదగిరిగుట్టపై వర్తక సంఘాన్ని రద్దు చేయాలంటూ ఆదివారం యాదాద్రి పరిరక్షణ కమిటీ ఆందోళన చేపట్టింది. తహసీల్దార్ కార్యాలయం నుంచి స్వామి వారి వైకుంఠ ద్వారం వరకు ర్యాలీ నిర్వహించారు. దేవస్థాన అధికారులు వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్లకు పిలవాలని డిమాండ్ చేశారు. పాత బస్ స్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో చేపట్టారు.