ADB: కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. బుధవారం పట్టణంలోని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఆయనకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు.