MDCL: అల్వాల్ డివిజన్ పరిధిలో వివిధ కాలనీలలో ఉన్న రేషన్ దుకాణాలపై స్థానిక డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ప్రతి ఒక్కరికి రేషన్ బియ్యం పంపిణీ, నాణ్యత పాటించడం లాంటి వాటిని పరిశీలించటం కోసం ఈ తనిఖీ చేయడం జరిగిందన్నట్లు పేర్కొన్నారు. అంతేకాక రేషన్ కార్డు లబ్ధిదారుల రికార్డులను సైతం పరిశీలించారు.