WGL: సర్పంచ్ ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శాంతి భద్రతలను పటిష్టం చేయడానికి గీసుగొండ పోలీసులు ఇవాళ భారీ కవాతు నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాలు, ప్రధాన రహదారుల గుండా పోలీసులు ఈ కవాతు నిర్వహించారు.