ASF: కాగజ్ నగర్ పట్టణం ఆదర్శనగర్ కపిల్ క్రికెట్ గ్రౌండ్, పార్కుకు నిధులు కేటాయించినందుకు ఎమ్మెల్యే హరీష్ బాబును కలిసి యువ క్రికెటర్లు ఆదివారం ధన్యవాదాలు తెలిపారు. క్రికెట్ గ్రౌండ్, పార్క్ కోసం కోటి రూపాయల నిధులు కేటాయించారు. MLA మాట్లాడుతూ.. డిపిఆర్ సిద్ధమైన తర్వాత ఈ గ్రౌండ్ విషయంలో క్రికెటర్ల సలహాలు సూచనలను స్వీకరిస్తామని తెలియజేశారు.