JGL: కొండగట్టులో ఒక భక్తురాలి నిజాయతీ అందరినీ ఆకట్టుకుంది. కోనేరు వద్ద ఓ భక్తురాలు మర్చిపోయిన కవరును గమనించిన మరో భక్తురాలు, దానిని సెక్యూరిటీ సిబ్బందికి అందజేసింది. వారు ఆ కవర్ను ASI రమణారెడ్డికి అప్పగించారు. అందులో రూ. లక్ష నగదుతో పాటు తులం బంగారం, వెండి వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. మైకులో ప్రకటించడంతో బాధితురాలు పోలీసులను సంప్రదించింది.