SRPT: కోదాడ మండలంలోని కూచిపూడి గ్రామంలో ఆదివారం ప్రమాదవశాత్తు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామ శివారులో ఉన్న మెట్టు శ్రీనివాసరావు, రామిశెట్టి మొగిలి, పసుపులేటి శ్రీనివాసరావు, శెట్టి గోవిందరావుకు చెందిన గడ్డివాములు ఒక్కసారిగా అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో సుమారు రూ.2 లక్షల విలువైన గడ్డి దగ్ధమై భారీ నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు.