MDK: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం అని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు. ఆదివారం తూప్రాన్ మండలం ఇమాంపూర్ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం పనులకు డీసీసీ అధ్యక్షులు ఆంక్ష రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ కీర్తన విఠల్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వరూప నవీన్ గౌడ్, పాలకవర్గం సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.