NZB: ముప్కాల్ మండలంలోని రైతులకు అవసరమైన యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి సాయికృష్ణ శుక్రవారం తెలిపారు. ఇప్పటి వరకు రేంజర్ల సహకార సంఘం ద్వారా 7,200 బస్తాలు, ఐడీసీఎంఎస్ ద్వారా 3,150 బస్తాలు, ప్రైవేట్ డీలర్ల ద్వారా 2,250 బస్తాల యూరియాను సరఫరా చేసినట్లు వివరించారు. యూరియా అందుబాటులో ఉందన్నారు.