ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకు కోతుల బెడద తీవ్రమవుతోంది. పలు మండలాల్లో కోతుల గుంపులు జనవాసాల్లోకి చొరబడటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పంట చేలపై పడి అపార నష్టం కలిగిస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యపు రాశుల మీద పడి చెల్లాచెదురు చేస్తున్నాయని వాపోతున్నారు. తక్షణమే అధికారులు చర్యలు తీసుకుని కోతుల సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.