MNCL: గ్రామాలకు చెందిన ప్రజలు సొంత ఊర్లకు బయలుదేరి వెళ్తున్నారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో శనివారం జన్నారం బస్టాండు ప్రయాణికులతో రద్దీగా మారింది. దాదాపు పది రోజులపాటు సెలవులు రావడంతో వారు తమ సొంత గ్రామాలకు బయలుదేరారు. అయితే సరిపడా బస్సులు లేకపోవడంతో వారు ఇబ్బందులు జరుపుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాలకు అదనపు బస్సులు నడపాలని ప్రజలు కోరారు.