RR: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మన్సురాబాద్ చౌరస్తాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనను పాతరేసిన మహావీరుల పోరాటమే నేటి తెలంగాణ ప్రజాస్వామ్యానికి పునాది అన్నారు. వేలాది అమర యోధులు ప్రాణత్యాగం చేసి నిర్మించిన స్వేచ్ఛను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యతని గుర్తు చేశారు.