NZB: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార గడువు ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని నవీపేట్ ఎస్సై తిరుపతి తెలిపారు. ఆ తర్వాత ఫ్లెక్సీలు, ప్రచార రథాలు,హోర్డింగ్లు ఎక్కడా ఉంచరాదని, వెంటనే తొలగించాలని ఆదేశించారు. వ్యక్తిగతంగా ప్రచారం చేయడం కూడా నిషేధమన్నారు. నియమాలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మండల ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.