NZB: బోధన్ మండలం ఉట్పల్లిలోని గుట్టపై వెలసిన మల్లన్న ఆలయంలో ఆదివారం ఘనంగా జాతర నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అధిక సంఖ్యలో వచ్చిన భక్తుల కొరకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.