ADB: ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో మురుగునీటిని నిల్వ చేయవద్దని సబ్ యూనిట్ అధికారి పవార్ రవీందర్ అన్నారు. మంగళవారం ఇచ్చోడ మండలంలోని గాంధీనగర్ గ్రామంలో డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు నిల్వ చేసి ఉంచిన మురుగు నీటిని శుభ్రపరిచారు. అనంతరం మురుగుకాలువల్లో బ్లీచింగ్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వసంత్, సుభాష్, ఆశ కార్యకర్త సుశీల పాల్గొన్నారు.