HNK: జిల్లాలో ఇటీవలి భారీ వర్షాలతో హంటర్ రోడ్డులోని గురుకుల డిగ్రీ కళాశాల నీట మునిగిన విషయం తెలిసిందే. దీంతో కళాశాల విద్యార్థులను హసన్పర్తి మండలం సుబ్బయ్యపల్లి వసతి గృహంలో ఉంచారు. అయితే మూడు రోజులుగా కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే కనీస వసతులు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరారు.